జూరాలలో పర్యటకుల తాకిడి.. నోరూరించే చేపల వంటలు

వనపర్తి జిల్లా ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు జలకళను సంతరించుకుంది. దీంతో ఆదివారం కృష్ణమ్మ నదీ ప్రవాహాన్ని తిలకించేందుకు వివిధ ప్రాంతాల నుంచి సందర్శకులు చేరుకున్నారు. జూరాల ప్రాజెక్టు చుట్టూ కృష్ణమ్మ అందాలు, ప్రాజెక్టు నుంచి దూకుతున్న నీటి పరవళ్లు, నోరూరించే చేపల రుచులతో ప్రాజెక్టు వద్ద పర్యాటకుల సందడి మొదలైంది. కృష్ణవేణి సోయగాలను తనివితీరా చూసి ఆనందిస్తూ.. ప్రాజెక్టు వద్ద నోరూరించే చేపల వంటకాలను ఆస్వాదించారు.

సంబంధిత పోస్ట్