కలెక్టరేట్ ముందు కార్మికుల ధర్నా

సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వనపర్తి కలెక్టరేట్ ముందు సోమవారం కార్మికులు ధర్నా చేపట్టారు. ధర్నాను ఉద్దేశించి సీఐటీయూ జిల్లా కార్యదర్శి పుట్ట ఆంజనేయులు మాట్లాడుతూ. కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పిస్తూ కనీస వేతనం రూ. 26 వేలు చెల్లించాలన్నారు. కార్మికులకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయాలని, ఎనిమిది గంటల పనిదినాన్ని అన్ని రంగాలలో అమలు చేయాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్