గ్యాస్ సమస్యతో బాధపడే వారు వర్షా కాలంలో కొన్ని ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. గోధుమలతో చేసిన బ్రెడ్, పేస్ట్రీలలో గ్లూటాన్ ఎక్కువగా ఉంటుంది. వర్షాకాలంలో ఇవి త్వరగా జీర్ణం కావు. జొన్నలు, బార్లీలను తీసుకుంటే అజీర్ణంతో పాటు గ్యాస్ సమస్యలు తలెత్తవచ్చు. ఫైబర్ ఎక్కువగా ఉన్నప్పటికీ వర్షా కాలంలో ఓట్స్‌కు దూరంగా ఉండాలి. మైదాతో చేసిన నూడుల్స్ తింటే గ్యాస్ సమస్య పెరుగుతుంది.