ఏపీలో సంక్రాంతి వేళ తీవ్ర విషాద ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. పల్నాడు జిల్లా చామర్రులో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. గౌతుకట్ల కోటయ్య అనే వృద్ధుడు(80) అనారోగ్యంతో మృతి చెందగా కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు. తర్వాత అతని కొడుకు గౌతుకట్ల నాగేశ్వరరావు, బావమరిది తెల్లమేకల నాగేశ్వరరావు మద్యం తాగారు. వెంటనే విరేచనాలు, వాంతులతో వారు అస్వస్థతకు గురై.. ఆసుపత్రికి తరలించే లోపే ప్రాణాలు విడిచారు.