మహారాష్ట్ర ప్రజలు కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పారని తెలంగాణ మాజీ మంత్రి హరీశ్ రావు ఎద్దేవా చేశారు. ఆదివారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం లగచర్లలో ప్రజలు తిరగబడితే ఇండస్ట్రియల్ కారిడార్ అని మాటమార్చారని తెలిపారు. లగచర్లకు వెళ్లి ప్రజలను ఒప్పించి భూసేకరణ చేయాలని ఆయన సవాల్ విసిరారు. పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు చేస్తామని అబద్ధాలు చెప్తున్నారని విమర్శించారు.