తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు మరోసారి భారీ వర్షం ముప్పు ఉన్నట్లు భారత వాతావరణ కేంద్రం తెలిపింది. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడిందని, దాని ప్రభావం తెలుగు రాష్ట్రాలపై తీవ్రంగా ఉండనుందని వెల్లడించింది. అల్పపీడన ప్రభావం పశ్చిమ బెంగాల్‌తోపాటు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో మరో నాలుగు రోజులు ఉంటుందని ఐఎండీ అంచనా వేసింది. ఇక రానున్న నాలుగు రోజులు తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.