కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జీడిమెట్ల బస్సు డిపో దగ్గర ఉన్న అంబేద్కర్ విగ్రహం దగ్గర ఆదివారం నిరసన చేయడం జరిగింది. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై తక్షణమే కేంద్ర హోం మంత్రి అమిత్ షాను బర్తరఫ్ చేయాలని సీపీఎం, సీఐటీయూ ఆధ్వర్యంలో నిరసన చేశారు. దేవదానం పాల్గొని మాట్లాడుతూ భారతదేశాన్ని మతోన్మాదుల నుండి కాపాడుకోవాలని భారత రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలని అన్నారు.