'లగచర్ల ఘటనలో కుట్ర కోణం ఉందని అనుకోవట్లేదు'

వికారాబాద్ జిల్లా లగచర్ల ఘటనలో కుట్ర కోణం ఉందని అనుకోవట్లేదని బీజేపీ ఎంపీ డీకే అరుణ అన్నారు. కుట్ర కోణం ఉందంటే ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తోందని ప్రశ్నించారు? కలెక్టర్ వెళ్లినప్పుడు ఎందుకు భద్రత కల్పించలేదన్నారు. ఘటన జరిగినప్పుడు అన్ని పార్టీల కార్యకర్తలు ఉన్నారని, ఫార్మా కంపెనీపై గ్రామాల్లో వ్యతిరేకత ఉందన్నారు. ప్రజలు వ్యతిరేకిస్తున్న ప్రాజెక్టుపై సీఎంకు ఎందుకంత ప్రేమ?, శాంతిభద్రతలను కాపాడటంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.

సంబంధిత పోస్ట్