AP: రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలను ప్రశ్నిస్తే.. అక్రమ అరెస్టులు చేస్తున్నారని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. గురువారం తాడేపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘విద్య వద్దు.. మద్యం ముద్దు. నాన్నకు పుల్లు.. అమ్మకు నిల్లు’’ అని పోస్ట్ చేసినందుకు ఓ సోషల్ మీడియా యాక్టివిస్ట్‌ను అక్రమంగా అరెస్ట్ చేశారని దుయ్యబట్టారు. ప్రశ్నిస్తే కేసులు పెట్టి, పోలీస్ స్టేషన్లకు తీసుకెళ్లి చిత్రహింసలు పెడుతున్నారని మండిపడ్డారు.