చైనాలో కరోనా సమయంలో ఎదురైన చేదు అనుభవం దృష్ట్యా యాపిల్ తన మనసు మార్చుకుంది. యాపిల్ 17 ముందస్తు తయారీని తొలిసారి భారత్లో చేపడుతోంది. ఇప్పటి వరకు ఈ ప్రక్రియను చైనాలో మాత్రమే నిర్వహించిన యాపిల్ సంస్థ తొలిసారి డ్రాగన్ దేశానికి వెలుపల చేపడుతుండడం గమనార్హం. ఇలా రూపొందిన ఫోన్ను 2025 రెండో అర్ధభాగంలో యాపిల్ విడుదల చేయనుంది. ఇటీవల విడుదలైన యాపిల్ 16 ప్రో మోడళ్లను సైతం ఇక్కడే చేపడుతున్నట్లు తెలుస్తోంది.