ధర్మపురి: "పొలంబాట"లో పాల్గొన్న విద్యుత్ ఏడీఈ

గొల్లపల్లి మండలంలోని లొత్తునూరు గ్రామంలో విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో "పొలంబాట" కార్యక్రమాన్ని ఏడీఈ వరుణ్ కుమార్ నిర్వహించారు. రైతులు పొలాల వద్ద స్టారర్లు, ఫ్యూజులు, స్టారర్ బాక్సులు నాణ్యతగా ఉండేలా చూసుకోవాలన్నారు. మోటర్లకు కెపాసిటర్లు బిగించుకోవాలని సూచించారు. విద్యుత్ సమస్యలకై టోల్ ఫ్రీ 1912 కి తెలియజేయాలని అన్నారు. ఇందులో చిల్వకోడూర్ ఏ ఈ అనిల్ కుమార్, సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్