2025లో ఐపీఎల్ 84 మ్యాచ్‌లకు చేరుకోకపోవచ్చని సూచించిన జై షా

2025లో ఐపీఎల్ మ్యాచ్‌ల సంఖ్యను 74 కంటే ఎక్కువ పెంచడంపై తాము ఆలోచిస్తున్నామని బీసీసీఐ సెక్రటరీ జై షా తెలిపారు. స్పాన్సర్‌షిప్ కాంట్రాక్టులు 2025-26లో 84 మ్యాచ్‌లకు పెంచాలని ప్రతిపాదించి, 2027 నాటికి 94 మ్యాచ్‌లకు పెంచాలని యోచిస్తున్నట్టు చెప్పారు. 84 మ్యాచ్‌లు ఐపీఎల్ అంటే టోర్నీకి అదనంగా వారం రోజులు అవసరమవుతాయని స్పష్టం చేశారు. దీనిపై ఆలోచిస్తున్నామని, వచ్చే ఏడాదికి 84 మ్యాచ్‌లు కొంతమేర సాధ్యం కాకపోవచ్చన్నట్టు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్