కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో నిస్సాహయక స్థితిలో ఉన్న నిరుపేదలు చలికి తట్టుకోలేకపోతున్న దృశ్యాలను చూసి వారు చలించి పోయారు. చిన్నారులందరూ కలిసి సుమారు 5, 000/- రూపాయలు పోగుచేసుకొని ఆదివారం నిరాధారమైన నిరుపేదలను గుర్తిస్తూ ప్రతి ఒక్కరికి దుప్పట్లను పంపిణీ చేశారు. చిన్నారుల ఆలోచనను బాన్సువాడ పట్టణ ప్రజలు, నాయకులు ప్రశంసించారు.