కామారెడ్డి జిల్లా పిట్లం మండలం రాంపూర్(కలన్) గ్రామంలో శనివారం విజయదశమి పండుగను ఘనంగా గ్రామ ప్రజలు జరుపుకున్నారు. భాజ భజంత్రీల నడుమ జమ్మిచెట్టు వద్దకు గ్రామ ప్రజలందరూ నడుచుకుంటూ వెళ్లి, జమ్మి చెట్టుకు ప్రత్యేక పూజలు చేసిన అనంతరం జమ్మి చెట్టు ఆకులు తెంపుకున్నారు. ఒకరికి ఒకరు ఆలయ్ బలయ్ చేసుకుని దసరా పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.