అన్ని రకాల హంగులతో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మిస్తున్నట్లు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. బోనకల్ మండలం లక్ష్మీపురంలో జరిగిన సభలో మాట్లాడుతూ.. అన్ని వర్గాల విద్యార్థులకు నాణ్యమైన విద్యతోపాటు క్రీడల్లో ప్రతిభ కనబరిచేందుకు క్రీడా మైదానాలను కూడా ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఏ ఒక్క విద్యార్థి జీవితంలో ఇది కోల్పోయాను అనే బాధ లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తామని పేర్కొన్నారు.