ఖమ్మం జిల్లా మధిర సర్కిల్ ఇన్స్పెక్టర్ మధు ఆదివారం మధిర పట్టణ ప్రజలకు పలు ముఖ్య సూచనలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆదివారం నుండి దేవి శరన్న నవరాత్రి ఉత్సవాలు ముగించుకొని అమ్మవారి నిమర్జన కార్యక్రమాలు నిర్వహిస్తున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ వారి నియమ నిబంధనలు పాటించాలని సూచించారు.