మధిర మున్సిపాలిటీ పరిధిలోని 3వ వార్డు కౌన్సిలర్ కర్నాటి భారతి ఆదివారం మధిర ఎమ్మెల్యే, రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సతీమణి అమ్మ ఫౌండేషన్ చైర్మన్ మల్లు నందిని విక్రమార్కను మర్యాద పూర్వకంగా కలిశారు. అనంతరం వారితో సమావేశమై 3వ వార్డులో నెలకొని ఉన్న ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేయవలసిందిగా విజ్ఞప్తి చేశారు.