తిరుమలాయపాలెం: జీవన వృత్తి పథకాన్ని అమలు చేయాలి

ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ కూలీలకు రూ. 12 వేల జీవన భృతి పథకాన్ని అమలు చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి తిమ్మిడి హనుమంతురావు అన్నారు. ఆదివారం తిరుమలాయపాలెం మండలం బచ్చోడులో నిర్వహించిన జనరల్ బాడీ సమావేశంలో ఆయన మాట్లాడారు. వ్యవసాయ కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ వచ్చేనెల 2న నిర్వహించే కలెక్టరేట్ ముట్టడిని జయప్రదం చేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్