కల్లూరు: సుస్థిర భారత్‌ కోసం బీజేపీ సభ్యత్వం పొందాలి

కల్లూరు మండలంలోని పుల్లయ్య బంజర గ్రామంలో ఆదివారం బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఖమ్మం పార్లమెంట్ ఇంఛార్జి తాండ్ర వినోద్ రావు, కన్వీనర్ నంబూరి రామలింగేశ్వరరావు హాజరై సభ్యత్వ నమోదు గురించి వివరించారు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలతో మూడోసారి బీజేపీ అధికారంలోకి వచ్చిందని చెప్పారు. సుస్థిర భారత్‌ కోసం బీజేపీ సభ్యత్వం పొందాలని ప్రజలను కోరారు.

సంబంధిత పోస్ట్