హరీష్ రావు మాటలను ఖండించిన కాంగ్రెస్ నాయకులు

మంత్రి తుమ్మలపై మాజీమంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలను వేంసూరు మండలం సీనియర్ నాయకులు పుచ్చకాయల సోమిరెడ్డి తీవ్రంగా ఖండించారు. బీఆర్ఎస్ హయాంలో సీతారామ ప్రాజెక్టును మధ్యలో వదిలేయగా కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేసిందన్నారు. తుమ్మల అంటే ఉమ్మడి జిల్లా అభివృద్ధి ప్రదాత అని అన్నారు. ఆగస్ట్ 15న హరీష్ రావు వైరాకు వస్తే గోదావరి జలాలతో శుభ్రంగా స్నానం చేయిస్తామని నాయకులు విమర్శించారు.

సంబంధిత పోస్ట్