వేంసూరు మండల పరిధిలోని కొండేగట్ల గ్రామంలో గల పల్లె దవాఖాన, అంగన్వాడి కేంద్రాన్ని శనివారం సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి తనిఖీలు చేశారు. ప్రభుత్వ వైద్యం పేదలకు అందకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. చిన్నారులకు నాణ్యమైన ఆహారం వడ్డించకుంటే ఉపేక్షించేది లేదన్నారు. రికార్డులు పరిశీలించారు. చంద్రశేఖర్ రెడ్డి, గుడిపర్తి శ్రీను, కోటిస్వామి, బుచ్చాలు, సత్యనారాయణరెడ్డి, తదితర కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.