ఖబరస్తాన్ కు ప్రభుత్వ స్థలం కేటాయిస్తామంటే చూస్తూ ఊరుకోం

సత్తుపల్లి అర్బన్ పార్కులో ఖబరస్తాన్ కు ప్రభుత్వ స్థలాన్ని కేటాయిస్తామంటే చూస్తూ ఊరుకోబోమని ఖమ్మం బీజేపీ పార్లమెంట్ కన్వీనర్ నంబూరు రామలింగేశ్వరరావు హెచ్చరించారు. శనివారం సత్తుపల్లిలోని పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. స్థానిక ఎమ్మెల్యే ముస్లింల మెప్పు కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధీనంలో ఉన్న సింగరేణి స్థలాన్ని ఖబరస్తాన్ కు కేటాయించాలని కలెక్టర్ ను కోరడం హాస్యాస్పదమన్నారు.

సంబంధిత పోస్ట్