ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

సత్తుపల్లి మండలం సదాశివునిపాలెంలో సన్న రకం వరిధాన్యం కొనుగోలు (ఐకేపీ) కేంద్రాన్ని ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ సోమవారం ప్రారంభించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలో భాగంగా సన్న వడ్లకు రూ. 500 నేరుగా ఖాతాల్లో వేస్తామన్నారు. ఐకేపీ సెంటర్ ద్వారా రైతులు తమ ధాన్యాన్ని కొనుగోలు చేసుకోవాలని, ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో వ్యవసాయ అధికారులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్