మొగల్ బిర్యానీ హోటల్ వద్దంటూ ఆందోళన

వేంసూరు మండలం మర్లపాడులో మొగల్ బిర్యానీ హోటల్ ఎదుట సోమవారం కొందరు యువకులు ఆందోళనకు దిగారు. అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న మొగల్ బిర్యానీ సెంటర్ ను మూసి వేయాలని డిమాండ్ చేస్తూ ప్రధాన రహదారిపై బైఠాయించి ధర్నా చేపట్టారు. హిందూ మనోభావాలను దెబ్బతీసేలా నిర్వహిస్తున్న మొగల్ బిర్యానీ సెంటర్ ను తక్షణం మూసివేయాలని, గోవు హత్యలను ఆపివేయాలని యువకులు డిమాండ్ చేశారు. జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు.

సంబంధిత పోస్ట్