నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదు: ఎమ్మెల్యే

తుఫాన్ హెచ్చరికల దృష్ట్యా అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని, ఏమాత్రం నిర్లక్ష్యం వహించినట్లు ఫిర్యాదులు వచ్చినా సహించేది లేదని ఎమ్మెల్యే మట్టా రాగమయి హెచ్చరించారు. సత్తుపల్లి క్యాంప్ కార్యాలయంలో రోడ్లు, భవనాలు, పంచాయతీరాజ్, నీటిపారుల, ఆర్ డబ్ల్యూఎస్, మిషన్ భగీరధ అధికారులతో సమీక్ష నిర్వహించారు. నియోజకవర్గంలో దెబ్బతిన్న రోడ్ల మరమ్మతులకు అంచనాలు రూపొందించి వెంటనే పనులు చేపట్టాలని ఆదేశించారు

సంబంధిత పోస్ట్