సాగర్ జలాలను తక్షణమే విడుదల చేయాలి

కాలువ మరమ్మతు పనులు త్వరగా పూర్తి చేసి, సాగర్ జలాలు వెంటనే విడుదల చేయాలని మాజీ ఎంపీపీ శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. సోమవారం తల్లాడ మండల బీఆర్ఎస్ కమిటీ ఆధ్వర్యంలో ఇరిగేషన్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ముందుగా నాయకులు మండల కేంద్రంలో భారీ ర్యాలీ చేపట్టారు. సాగర్ జలాలను విడుదల చేయకపోవడం వల్ల ఆయకట్టు రైతులు వేసిన పంటలు ఎండిపోతున్నాయని చెప్పారు. నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ. 20 వేలు ఇవ్వాలన్నారు.

సంబంధిత పోస్ట్