సత్తుపల్లి: గీత కార్మికులకు కాటమయ్య రక్షణ కిట్లు పంపిణీ

సత్తుపల్లి నియోజకవర్గానికి చెందిన గీత కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మంజూరైన కాటమయ్య రక్షణ కిట్లను శనివారం స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎంపీ రామసహాయం రఘురామిరెడ్డి పంపిణీ చేశారు. మొత్తం 100 మంది గీత కార్మికులకు కాటమయ్య రక్షణ కిట్లను పంపిణీ చేసినట్లు ఎమ్మెల్యే మట్ట రాగమయి తెలిపారు. గీత కార్మికులు తాటి చెట్లను ఎక్కే క్రమంలో రక్షణ కిట్లను సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్