సత్తుపల్లి: మున్సిపాలిటీ కార్యాలయాన్ని తనిఖీ చేసిన ఎమ్మెల్యే

సత్తుపల్లి మున్సిపాలిటీ కార్యాలయాన్ని శుక్రవారం ఎమ్మెల్యే మట్టా రాగమయి ఆకస్మికంగా తనిఖీ చేశారు. కార్యాలయంలో ఉన్న పలు రికార్డులను పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా వివిధ పనుల నిమిత్తం కార్యాలయానికి వచ్చిన వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పనుల నిమిత్తం కార్యాలయానికి వచ్చే ప్రజల పట్ల మర్యాదపూర్వకంగా వ్యవహరించి సమస్యను వెంటనే పరిష్కరించాలని అధికారులకు సూచించారు.

సంబంధిత పోస్ట్