తల్లాడ: వెనుకబడిన నిరుపేదలను ఆదుకోవడమే లక్ష్యం

సమాజంలో వెనుకబడిన నిరుపేదలను ఆదుకోవడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు బహుజన సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు మోదుగు బాలకృష్ణ అన్నారు. గురువారం తల్లాడ మండలం బిల్లుపాడు గ్రామంలో నిరుపేదలకు, వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఆరోగ్య పరంగా అవసరమైన మందులు పంపిణీ చేయడంతో పాటు పేదలు ఉంటే ఆర్థిక సహాయ సహకారాలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. సేవా సమితి ద్వారా పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు చెప్పారు.

సంబంధిత పోస్ట్