వేంసూరు: మర్లపాడులో సీపీఎం మండల మహాసభ

వేంసూరు మండలం మర్లపాడు గ్రామంలో ఆదివారం సీపీఎం మండల 9వ మహాసభ నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర కమిటీ సభ్యురాలు మాచర్ల భారతి పాల్గొని మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి ఒక్క హామీని అమలు చేయాలని డిమాండ్ చేశారు. హామీలను అమలు చేయలేని తరుణంలో ప్రజల పక్షాన నిలబడి హామీల అమలు కోసం పోరాడుతామని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్