రైతుల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యలక్ష్యమని ఎమ్మెల్యే మట్ట రాగమయి అన్నారు. వేంసూరు మండలం వెంకటాపురం గ్రామంలో ఏర్పాటు చేసిన ఐకెపి సెంటర్ ను సోమవారం ఎమ్మెల్యే ప్రారంభించారు. రైతులను ఇబ్బందులకు గురి చేయకుండా మద్దతు ధర ప్రకారం ధాన్యాన్ని కొనుగోలు చేయాలని అధికారులను సూచించారు. రైతులకు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వరి ధాన్యం క్వింటాకు రూ. 500 బోనస్ ఇస్తున్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు.