కారేపల్లి: కార్పొరేట్ హాస్పిటల్లో ఫీజుల దోపిడిని అరికట్టాలి

ప్రైవేట్ హాస్పిటల్లో ఫీజుల దోపిడిని అరికట్టాలని, ప్రభుత్వ హాస్పిటల్స్ ను బలోపేతం చేయాలని పీవైఎల్ జిల్లా కార్యదర్శి ఎన్. వి రాకేష్ డిమాండ్ చేశారు. బుధవారం కారేపల్లి మండలం టేకులగూడెంలో వాల్ పోస్టర్ ను ఆవిష్కరించారు. ప్రభుత్వ హాస్పిటల్స్ లో మెరుగైన వైద్యం అందక ప్రజలు ప్రైవేట్ హాస్పిటల్స్ ను ఆశ్రయిస్తున్నారని, దీనిని ఆసరాగా చేసుకున్న హాస్పిటల్స్ ఇష్టారాజ్యంగా ఫీజుల దోపిడీకి పాల్పడుతున్నారన్నారు.

సంబంధిత పోస్ట్