కారేపల్లి మండలం సింగరేణి గ్రామపంచాయతీ బీసీ కాలనీలో బిఆర్ఎస్ జిల్లా మైనార్టీ నాయకులు షేక్ గౌసుద్దీన్ శనివారం ముఠాల వారిగా 20 కుటుంబాల మహిళలకు చీరలు కానుకగా అందజేశారు. ఈ సందర్భంగా షేక్ గౌసుద్దీన్ మహిళలతో మాట్లాడుతూ, సింగరేణి గ్రామపంచాయతీలో ఎవరికి ఏ కష్టం వచ్చినా తాను ఆదుకుంటానని భరోసా కల్పించారు. ఈ సందర్భంగా మహిళలు గౌసుద్దీన్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఖలీ లూల ఖాన్, తదితరులు పాల్గొన్నారు.