కారేపల్లి: రూ.50వేల విలువైన మద్యం పట్టివేత

ఖమ్మం నుంచి కారేపల్లి మండలంలోని సీతారామపురానికి కారులో అక్రమంగా తరలిస్తున్న రూ. 50 వేల విలువైన మద్యాన్ని శనివారం రాత్రి ఎక్సైజ్ శాఖ ఉద్యోగులు స్వాధీనం చేసుకున్నారు. గ్రామానికి చెందిన ఓ బెల్ట్ షాపు నిర్వాహకుడు ఖమ్మంలోని వైన్స్ నుంచి ఈ మద్యం తీసుకొస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు పక్కా సమాచారంతో తనిఖీ చేపట్టి మద్యాన్ని స్వాధీనం చేసుకున్నామని సీఐ స్రవంతి, ఎస్సై వసంతలక్ష్మి తెలిపారు.

సంబంధిత పోస్ట్