కొణిజర్ల: కూలీలకు రూ. 12 వేలు జీవన భృతి ఇవ్వాలి

వ్యవసాయ కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు ఏడాదికి రూ. 12 వేలు జీవన భృతి ఇవ్వాలని సీపీఐ ఎంఎల్ మాస్ లైన్ జిల్లా నాయకుడు, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర సభ్యుడు కంకణాల అర్జున్ రావు డిమాండ్ చేశారు. గురువారం కొణిజర్ల మండలంలోని సింగరాయపాలెంలో వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కంకణాల పెద్ద వెంకటి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్