కేంద్ర మాజీ మంత్రి, రాజ్యసభ సభ్యురాలు రేణుక చౌదరి వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ తో కలిసి శుక్రవారం సింగరేణి మండలంలో పర్యటించనున్నారు. ఇటీవల మృతి చెందిన వ్యవసాయ శాస్త్రవేత్త నూణావత్ అశ్విని కుటుంబాన్ని పరామర్శించనున్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, ప్రజాప్రతినిధులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా మండల అధ్యక్షులు తలారి చంద్ర ప్రకాష్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు.