సింగరేణి: మేదరి టోనీ సొంత ఖర్చుతో పైప్ లైన్ పనులు

సింగరేణి గ్రామంలోని భరత్ నగర్ కాలనీలో స్థానిక వాసులు గత నాలుగు, ఐదు నెలలుగా పంపు నీళ్లు రాక ఇబ్బంది పడుతూ సోమవారం స్థానిక కాంగ్రెస్ నాయకులు మేదరి టోనీ దృష్టికి తీసుకెళ్లగా, వెంటనే స్పందించారు. స్థానిక ఎమ్మెల్యే మాళోత్ రాందాస్ నాయక్ ఆదేశాల మేరకు సొంత ఖర్చుతో, గ్రామ పంచాయితీ సిబ్బంది సహకారంతో సోమవారం రాత్రి కొత్త పైప్ లైన్ పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్