రోడ్డు పక్కన ఆగి ఉన్న కారును వేగంగా వచ్చిన మరో కారు ఢీకొట్టింది. తమిళనాడులోని కొల్లాం జిల్లా పరవూర్ వద్ద రోడ్డు పక్కన పార్క్ చేసిన కారు నుంచి ఓ మహిళ దిగి వెళ్ళింది. అకస్మాత్తుగా ఎదురుగా వస్తున్న కారు రోడ్డు పక్కన ఆగి ఉన్న ఆ కారును ఢీకొట్టింది. అదృష్టవశాత్తు ఆ మహిళ కారు నుంచి దిగి ప్రాణాలతో బయటపడింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ముగ్గురికి గాయాలయ్యాయి.