అతుల్ సుభాష్ కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

67చూసినవారు
అతుల్ సుభాష్ కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
భార్య వేధింపులు తాళలేక బెంగళూరు టెకీ ఆత్మహత్య చేసుకున్న ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. అయితే, తన మనవడిని తమ కస్టడీకి అప్పగించాలని ఇటీవల అతుల్‌ తల్లి సుప్రీంకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారించిన ధర్మాసనం వీడియో కాల్‌ ద్వారా బాలుడిని చూశారు. చిన్నారితో మాట్లాడారు. అనంతరం ధర్మాసనం తీర్పు వెలువరించింది. ఆ బాలుడు తన తల్లి వద్దే ఉంటాడని తీర్పునిచ్చింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్