పదవ తరగతి పరీక్షలలో మండల టాపర్ గా సుప్రజ

10వ తరగతి పరీక్షలలో మండల టాపర్ గా మండల కేంద్రానికి చెందిన జూపల్లి సుప్రజ 10/10 జిపిఏ తో మండల టాపర్ గా నిలిచింది. స్థానిక తెలంగాణ మోడల్ పాఠశాలలో చదువుతున్న సుప్రజ మంగళవారం వెలువడిన పదవ తరగతి పరీక్షలలో మండల టాపర్గా నిలిచింది. అలాగే కొమ్ముగూడెం పాఠశాలకు చెందిన వినయ్ కుమార్ 9. 8తో రెండో స్థానంలో నిలిచాడు. విద్యార్థులను మండల విద్యాశాఖ అధికారి జయరాజు, మోడల్ పాఠశాల ప్రిన్సిపల్ ఎండి అక్తర్ అభినందించారు.

సంబంధిత పోస్ట్