కేంద్ర ప్రభుత్వం చెరుకు మద్దతు ధర టన్నుకు రూ. 5 వేలు ప్రకటించాలని రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు డిమాండ్ చేశారు. శనివారం ముట్టాపురంలో నిర్వహించే చెరకు రైతుల రాష్ట్ర అవగాహన సదస్సుకు సంఘం జాతీయ, రాష్ట్ర అధ్యక్షులు రవీంద్రన్, పోతినేని సుదర్శన్ పాల్గొంటారన్నారు. రైతులకు సబ్సిడీలు, రాయితీలు కల్పించి ప్రోత్సాహకాలు కల్పించాలని, చెరకు రైతుల సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమం చేస్తామని హెచ్చరించారు.