పాల్వంచ పట్టణంలోని దమ్మపేట కూడలి సెంటర్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జయంతి కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. ఇందిరాగాంధీ విగ్రహానికి రాష్ట్ర అటవీ అభివృద్ధి శాఖ చైర్మన్ వీరయ్య పూలమాలతో నివాళులు అర్పించారు. పేద ప్రజల జీవితాలను మార్చేందుకు ఇందిరా గాంధీ చేసిన సేవలు మరువలేనివని వీరయ్య పేర్కొన్నారు.