మెరిసేదంతా బంగారం కాదన్నట్లు.. ప్రేమలో భాగస్వామి చూపే అంతులేని అభిమానం నిజమైన ప్రేమ కాకపోవచ్చంటున్నారు రిలేషన్‌షిప్ నిపుణులు. భాగస్వామిని మానసికంగా, ఎమోషనల్‌గా లొంగదీసుకోవడాన్ని ‘లవ్ బాంబింగ్’ అంటారు. గత కొంతకాలంగా 12-27 ఏళ్ల మధ్య వయసు వారిలో ఈ ట్రెండ్ పెరుగుతోంది. లవ్ బాంబింగ్ చేసే వ్యక్తి భాగస్వామిని భావోద్వేగపరంగా ఆకర్షించడానికి అతి ప్రేమ, ప్రత్యేక శ్రద్ధ చూపిస్తారు. వీరు భాగస్వామి నమ్మకాన్ని పొంది, వారి నుంచి రహస్యాలు తెలుసుకున్నాక భవిష్యత్తులో వేధింపులకు గురి చేసే అవకాశం ఉంది.