బెల్లంపల్లి: సింగరేణి బంకర్ స్థలంలో వాహనాల పార్కింగ్ ఏర్పాటు

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో కూరగాయల మార్కెట్ ముందు ఉన్న బంకర్ స్థలాన్ని మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జెసిబితో పేరుకుపోయిన చెత్త, పిచ్చిమొక్కలు గురువారం తొలగించారు. మున్సిపల్ ఛైర్ పర్సన్ జక్కుల శ్వేత మాట్లాడుతు, పట్టణంలోని బజార్ ఏరియా నుంచి కాంట వరకు రోడ్లపై విక్రయాలు జరిపే వారు బంకర్ స్థలంలో విక్రయించుకోవచ్చు అన్నారు. అదేవిధంగా బంకర్ స్థలంలో పార్కింగ్ సౌకర్యం కల్పిస్తున్నామన్నారు.

సంబంధిత పోస్ట్