బిజెపి 24 గంటల రైతు దీక్ష

రైతు హామీల సాధన దీక్ష చేపడుతున్నట్లు బిజెపి దుబ్బాక మండల ఉపాధ్యక్షుడు వడ్లూరి నారాయణరెడ్డి తెలిపారు. రైతులకు ఇచ్చిన హామీలను రాష్ట్ర ప్రభుత్వం విస్మరించిందని, ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ నెల 30 ఉదయం నుంచి అక్టోబరు 01 ఉదయం వరకు 24 గంటల పాటు హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు ధర్నా చౌక్ వద్ద రైతు హామీల సాధన దీక్ష చేస్తున్నట్లు తెలిపారు. ఈ దీక్షలో ఎమ్మెల్యేలు, ఎంపిలు, కేంద్రమంత్రులు పాల్గొంటారని తెలిపారు.

సంబంధిత పోస్ట్