సిద్దిపేట: మాజీ సర్పంచులకు గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి

తాజా మాజీ సర్పంచులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. మార్చిలోపు పెండింగ్ బకాయిలు చెల్లిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. సోమవారం గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన పెండింగ్ బిల్లులు చెల్లించాలని మాజీ సర్పంచుల ఆందోళనపై స్పందించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అందరికీ తెలుసు. సర్పంచులు ఓపిక పట్టాలని విజ్ఞప్తి చేశారు. సర్పంచులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.

సంబంధిత పోస్ట్