మెదక్ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల గ్రౌండ్ లో మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన మన ఇంటి బతుకమ్మ కార్యక్రమంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు. ఈ కార్యక్రమంలో మహిళా నాయకురాళ్లు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.