మెదక్ జిల్లా దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా సుప్రసిద్ధ పుణ్య క్షేత్రమైన శ్రీ వన దుర్గాదేవిని మంగళవారం నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి దర్శించుకున్నారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్బంగా సునీత రెడ్డి మాట్లాడుతూ అదిపరాశక్తి స్వరూపిణి అయిన దుర్గాదేవి ఆశీస్సులు అందరిపై వుండాలని అమ్మ వారి కృపా కటాక్షాలలో ఈ ప్రాంతం అంతా పాడీపంటలతో సుభిక్షంగా ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు.