మెదక్ మున్సిపల్ పరిధిలోని 20 వర్డ్‌లో క్షేత్ర స్థాయిలో సర్వే తీరునూ జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ప్రభుత్వం జారీ చేయనున్న డిజిటల్ కార్డు సర్వే పూర్తిస్థాయిలో పక్కాగా నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. సర్వే తీరును కలెక్టర్ స్వయంగా పరిశీలించి అధికారులకు తగిన సలహాలు, సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో రమాదేవి, తహశీల్దార్ లక్ష్మణ్ బాబు, సంబంధిత సర్వే బృందాలు, తదితరులు పాల్గొన్నారు.