మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీలో సమగ్ర కుటుంబ సర్వేను జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కుటుంబ ఆర్థిక సర్వే విజయవంతంగా కొనసాగుతుందన్నారు. నేటి వరకు 30%కు పైగా సర్వే పూర్తయినట్టు తెలిపారు. వారం రోజుల్లో సర్వే పూర్తి చేస్తామన్నారు. ప్రజలు అపోహలకు పోకుండా సమగ్ర ఆర్థిక కుటుంబ సర్వేకు సహకరించాలన్నారు.